నాలుగు ఏళ్లలో నాలుగు ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

-

వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు ఎన్వోసి సాధించాము. దీంతో వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాం. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించింది. డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తాం. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్ టైల్ పార్కు వచ్చింది. దేశంలోనే పెద్దది. భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కూడా సాధిస్తాం.

రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగు ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తాం. విజయవాడ హైవే ఆరు లైన్ల రోడ్డు పనులు జనవరిలో ప్రారంభిస్తాం. 2018లో ప్రారంభం అయిన ఉప్పల్ స్కైవే పనులు 30 శాతం మాత్రమే పూర్తి అయ్యాయి. రాబోయే ఏడాదిన్నర లోపు ఉప్పల్ స్కై వే నిర్మాణం పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డు 2016లో నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అయితే కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేయాలి. రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులు కూడా పూర్తి చేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news