జామాబాదు జిల్లా రాంరెడ్డి గార్డెన్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సమావేశంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ది నకిలీ దీక్ష. బూస్ట్ తాగుతూ, సెలైన్లు, విటమిన్స్ తింటూ దీక్ష చేసి పెద్ద త్యాగం చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు అని అన్నారు. కేసీఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో మా గోనె ప్రకాష్ రావుని అడిగితే కుల్లం కుల్ల చెప్తడు. కానిస్టేబుల్ కిష్టయ్యది, శ్రీకాంతాచారి ది నిజమైన త్యాగం. తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ నిర్ణయంతో జరిగింది.
ఇక కేసీఆర్ 10 ఏళ్ల లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకి ఇవ్వలేదు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తాం. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టిండు. వచ్చే మూడేళ్లలో ప్రతీ ఊరికి బిటి రోడ్, మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తాం. ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే బావ బామ్మర్ది ప్రజా ప్రభుత్వం పడిపోతుందని విమర్శిస్తున్నారు. సంక్రాంతికి ఎకరాకు 7 వేల చొప్పున రైతు భరోసా వేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.