బీఆర్ఎస్‌ ఒక్క ఎంపీ సీటు గెలిచినా నేను దేనికైనా సిద్ధం – కోమటిరెడ్డి

-

బీఆర్ఎస్‌ పార్టీకి సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ ఒక్క సీటు గెలిచినా తాను దేనికైనా సిద్ధమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ జిల్లా ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డి తో కలిసి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు…అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు.

 

ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బిజెపి పార్టీ….హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పనికిరాని చిట్ చాట్ లు బంద్ చేయాలని.. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధమని సవాల్‌ చేశారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దు…బండి సంజయ్ ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డి కి తెలుసా అని నిలదీశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news