పదేళ్లు BRS నేతలు పందికొక్కుల్ల దోచుకుతున్నారు..!

-

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. మరి కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో.. ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో అని మంత్రి కొండా సురేఖ అన్నారు. పదేళ్లు BRS నేతలు పందికొక్కుల్ల దోచుకుతున్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు నిధులు లేకుండా చేశారు.

కేసీఆర్ సీఎం గా ఉన్న కేటీఆర్ షాడో సీఎం గా పని చేశాడు. ప్రతి ఒక్క దానిలో కేటీఆర్ హస్తం ఉంది. లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి సలులనించేంత సమయం ఇవ్వకుండా ప్రభుత్వం మీద బట్టకాల్చి వేస్తున్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ, దళిత బంధు, ధరణి ఇలా అన్నింటిలో అవినీతి చేశారు. కాంగ్రెస్ సర్కార్ అవన్నీ బయట పెడుతుంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అప్పులు తీర్చేందుకు.. లోటును భర్తీ చేసేందుకు పని చేస్తుంటే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version