అటు డాక్టర్ కాలే.. ఇటు ఐఏఎస్ కాలే : మంత్రి కేటీఆర్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో ఇవాళ వైద్యకళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఏటా 10వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. తాను కూడా బైపీసీ విద్యార్థినే అని.. మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకున్నారని.. మా నాన్న ఐఏఎస్ చేయాలని అనుకునేవారు. అటు అమ్మ కోరికను, ఇటు నాన్న కోరికను తీర్చలేకపోయానని చివరికీ రాజకీయ నాయకుడిని అయ్యానని తెలిపారు మంత్రి కేటీఆర్.

ఎంసెట్ లో 1600 ర్యాంక్ సాధించినా ఎంబీబీఎస్ సీట్ రాలేదు. ప్రస్తుతం తెలంగాణలో 10వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి..తాను 2009లో సిరిసిల్ల ఎమ్మెల్యే గా ఎన్నికయినప్పుడు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజీ ఏర్పాటు కొసం గొడవ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క డిగ్రీ కాలేజీ కోసం సిరిసిల్ల వేములవాడ మధ్య గొడవ జరిగింది. అరవై ఏండ్ల పాలనలో ఒక్క డిగ్రీ కాలేజ్ కోసం లొల్లి అయింది.
తెలంగాణలో సిరిసిల్లలో విద్యా వైద్యం విషయంలో అగ్రస్థానంలో ఉంది. డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణా నెంబర్ వన్ గా ఉంది.. ప్రతీ వందమంది డాక్టర్ లలో 43 మంది తెలంగాణా లో తయారు అవుతున్నారు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కు అనే స్థితి నుంచి సర్కార్ దవాఖానలో మాత్రమే ప్రసవం అయ్యే స్థితికి వచ్చాం. ఒక్క డాక్టర్ పోస్ట్ కోసం.అడుక్కునే స్థితి నుంచి జిల్లాకు 100 కి పైగా స్పెషలిస్ట్ డాక్టర్ లు అందుబాటులోకి వచ్చారు అని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 2 కాలేజీలు మాత్రమే కట్టారు. 9 ఏండ్ల తెలంగాణలో 28 మెడికల్ కాలేజీలు వచ్చాయి. నేడు సిరిసిల్లకు జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ వచ్చాయి.. త్వరలో ఆక్వా యూనివర్సిటీ వచ్చాయి..వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది. పేదలకు సేవ చెందేందుకు మంచి శిక్షణ పొందండి అని సూచించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news