రాజాసింగ్‌తోనే గోషామహల్ కమలం సొంతం?

రాజాసింగ్ బిజెపిలో మంచి పట్టున్న నాయకుడు. హిందుమతం కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి. ఇక రాజకీయంగా గోషామహల్ లో బిజెపి జెండా ఎగరవేయడానికి అహర్నిశలు కష్టపడ్డాడు. తనకంటూ ప్రత్యేక క్యాడర్ ను ఏర్పరచుకున్నాడు. రాజాసింగ్ గోషామహల్లో రెండుసార్లు బిజెపి జెండాని ఎగురవేశాడు. ఈసారి కూడా రాజాసింగ్ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రాజా సింగ్ ఓ మతాన్ని కించపరిచే విధంగా చేసిన విమర్శలకు అధిష్టానం రాజాసింగ్ పై సస్పెన్షన్ విధించింది.

అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బండి సంజయ్, రాజా సింగ్ మంచి సంబందాలు ఉన్నాయని,  రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తి వేయించడానికి సంజయ్ చాలా రకాలుగా ప్రయత్నించాడని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సస్పెన్షన్ ఎత్తివేస్తారు అనే సమయానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు మారడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

 

ఇప్పటివరకు రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయలేదు. పైగా ఈ సీటు కోసం బి‌జే‌పి నుంచి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ రాజాసింగ్ కాకుండా ఎవరు నిలబడిన బి‌జే‌పి గెలిచే ఛాన్స్ లేదని అంటున్నారు. ఏది ఏమైనా గోషామహల్లో బిజెపి జెండా ఎగరాలంటే ఖచ్చితంగా రాజాసింగ్ మాత్రమే పోటీ చేసి తీరాలి.

రాజాసింగ్ కి బదులుగా బి‌జే‌పి మరే ఇతర అభ్యర్థిని నిలబెట్టినా  గోషామహాల్లో గెలవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి బిజెపి అధిష్టానం ఒక మెట్టు దిగి రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి బరిలో నిలబెడుతుందా లేదా ఎంఐఎం మద్ధతుతో పోటీ చేయనున్న బీఆర్ఎస్‌కు గోషామహల్‌ని అప్పగిస్తారో వేచి చూడాల్సిందే..,.