రజాకార్ సినిమా​ టీజ‌ర్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్..!

-

తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తోంది. పశ్చిమ బెంగాల్​ ఎన్నికల సమయంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీసుకు వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వం. కర్నాటక ఎన్నికల్లో కేరళ స్టోరీ ని దింపింది. ఇక ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేపథ్యంలో ముస్లింలను టార్గెట్​ చేస్తూ.. రజాకార్ సినిమా తీసింది. ఈ సినిమాకు యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మంచారు. ఇక ఈ సినిమా టీజ‌ర్‌ను తాజాగా విడుద‌ల చేయ‌గా.. ఇది కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది.

ఈ ట్రైల‌ర్‌ను పరిశీలించినట్టయితే.. 1948 సమయంలో నిజాం ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత పోలీస్ యాక్షన్ లాంటి పరిస్థితిని చిత్రకరిస్తూ.. ముస్లింలే పెద్ద నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇక ఈ టీజ‌ర్ చూసిన నెటిజెన్లు, మత పెద్దలు, రాజకీయ పార్టీ నేతలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమాను తీశార‌ని మండిపడ్డారు. రాజకీయాల కోసం తప్పుడు సినిమాలు తీస్తే జనం నమ్మరంటూ పేర్కొంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఇదే విష‌యంపై మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు.

కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రజాకార్​ సినిమా విషయం మేము సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తామని.. తెలంగాణ పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతినకుండా చూసుకుంటారని మంత్రి కేటీఆర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో రాసుకోచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news