తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తాజాగా ఆయన కుటుంబానికి సంబంధించిన అరుదైన ఫోటోని షేర్ చేశారు. అభిమానులకు తన తాతని పరిచయం చేశారు. ” నా కుటుంబం నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. మా తాత శ్రీ జే కేశవ రావు గారు. గాంధీజీ స్ఫూర్తితో 1940 చివరిలో తెలంగాణ తిరుగుబాటులో భాగంగా నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు. స్వతంత్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారు”. అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.
ఆ ఫోటోలో చిన్నప్పటి కేటీఆర్ కనిపించారు. కాగా తాను ఎదిగిన తర్వాత తాతయ్య కేశవరావుతో కలిసి దిగిన ఫోటోలు కేటీఆర్ తాజాగా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎప్పుడూ చలాకీగా ఉండే మా తాతయ్య జోగినపల్లి కేశవరావు గారితో.. మరో ఫోటో అంటూ ట్వీట్ చేశారు.
One more pic with my doting grandfather Sri Joginpally Keshava Rao Garu
I was his first grandkid & enjoyed his special affection 😊 pic.twitter.com/Wql4hbbigB
— KTR (@KTRTRS) September 4, 2022