చాలా మంది అరటిని సాగు చేస్తున్నారు. అయితే అరటి ఉత్పత్తిని నులి పురుగులు తగ్గించచ్చు. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడు అరటి ఉత్పత్తిని నులి పురుగులు ఆపలేవు. పైగా అరటి సాగు కూడా బాగుంటుంది. నిజానికి ఇటువంటి వాటిని కనుక జాగ్రత్తగా చూసుకోక పోతే సాగు లో ఇబ్బందులు కలిగి రైతులకి నష్టం వాటిల్లుతుంది. అయితే మరి ఈరోజు అరటి ఉత్పత్తిని తగ్గించేసే నులి పురుగులు గురించి వాటి నుండి పంటను ఎలా రక్షించుకోవాలి అనే దాని కోసమూ చూసేద్దాం. పూర్తి వివరాలను చూస్తే..
నులి పురుగులు వేరు విభాగం లో గుడ్లను పెడతాయి. అలానే చెట్టు కింది భాగంలో మచ్చ వస్తుంది. ఇలా కనుక చెట్టు కింది భాగంలో మచ్చ వచ్చిందంటే అరటి చెట్లకి నులి పురుగులు చేరాయి అని మనం గ్రహించాలి. అలానే గుడ్లు పొదిగిన తర్వాత లార్వా వేరు బీగాన్ని తినడం జరుగుతుంది.
అయితే ఎప్పుడైతే ఇది దెబ్బతింటుందో దాన్ని శిలీంధ్రాలు దాడి చేయడం జరుగుతుంది. కనుక అంత వరకు చూసుకోకుండా తప్పు చెయ్యద్దు. పైగా వీటి కారణంగా అరటి పండ్లు తగ్గుతాయి. అలానే అరటి పండ్లు కూడా పెద్దగా ఎదగలేవు. చిన్నవిగానే ఉండిపోతాయి.
ఈ సమస్యను ఎలా తగ్గించాలి..?
ఇక ఈ సమస్య కలుగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది చూస్తే.. అరటిని నాటేటప్పుడు కార్బోఫ్యూరాన్ 3G లేదా ఫోరేట్ 10G వాడాలి. దీని వలన సమస్య కలగదు. లేదంటే 250-400 గ్రాముల వేప పిండిని వెయ్యండి. ఇది కూడా సమస్యను కలగనివ్వదు. నులి పురుగులను తట్టుకొనే అరటిని ఎంచుకోవడం కూడా మంచిది. ఇలా నులిపురుగులు నుండి పంటను రక్షించచ్చు.