సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలను శాలువాలను ఉపయోగించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లైతే దీని వెనుక ఉన్న నేతన్నలందరికి ఆర్థికంగా సహకారం చేసినట్టు ఉంటుంది. ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ అధికారులను కోరుతున్న.. సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు సింతటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలు వాడండి అన్నారు.
అలాగే గణేష్ ఉత్సవాల సందర్భంలో అతిథులు వచ్చినప్పుడు కానీ ఇతర ఏ సంధర్భంలో అయినా సింథటిక్ శాలువాలు ఉపయోగించే బదులు కాటన్ వాడండి. బయట రాష్ట్రాల నుండి ఉత్పత్తి అయ్యే సింథటిక్ శాలువాల బదులు మన తెలంగాణ లో మన నేతన్నలు ఉత్పత్తి చేసే కాటన్ వస్త్రాలను ఎవరికైనా బహుమానంగా ఇవ్వాలన్న , సన్మాన కార్యక్రమంలో అయినా కాటన్ టవల్స్ వాడండి. ఒకసారి కప్పిన తరువాత ఎందుకు ఉపయోగించుకోకుండా సింథటిక్ ను వాడి పర్యావరణాన్ని చెడగొట్టుకోవద్దు. పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు రోజు వారి ఉపయోగానికి వాడడం నేతన్నలకి అండగా ఉన్నట్టు ఉంటుంది అందరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు మంత్రి పొన్నం.