హుసేన్ సాగర్ లో నిమజ్జనం.. కోర్టు ఎలా చెప్తే అలా..?

-

వచ్చే నెల 17న జరగబోయే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పై అన్ని శాఖలతో సమన్వయం ఏర్పాటు చేశాము అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అధికారులతో మీటింగ్ నిర్వహించాం. గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటాం అని పొన్నం తెలిపారు.

అలాగే దేశంలో ముంబై తరువాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి బోనాలు ఎలా అయితే ఘనంగా జరుగుకున్నామో అలాగే గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తాం.. హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా చూస్తాం అని అన్నారు. ఇందులో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ఘనంగా నిర్వయించాలని నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా ఈ ఏడాది హుసేన్ సాగర్ నిమజ్జనం అనే అంశం కోర్ట్ ఆదేశాలు ప్రకారం ముందుకు పోతాం అని మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news