వెంకయ్య నాయుడుపై భారత ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..!

-

వెంకయ్య నాయుడు ఆలోచనలు మహోన్నతమైనవి. ఆయన తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారు అని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ పేర్కొన్నారు.. ఆయన ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలతో మమేకమయ్యారు. వారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనది అని అన్నారు. అలాగే వెంకయ్య నాయుడు రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నప్పుడు ఆయన సతీమణి ఉషమ్మ వారి కుటుంబానికి అండగా నిలిచారు. వెంకయ్య నాయుడు విజయాల వెనుక ఆమె సహకారం వెలకట్టలేనిది అని తెలిపారు.

అలాగే స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలు త్వరలో జరగనున్నాయి. ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా 23 ఏళ్ళ పాటు సేవా ప్రస్థానం సాగించటం చాలా గొప్ప విషయం. ఓ మహాయజ్ఞంలా నిర్వహించిన ఈ ప్రస్థానాన్ని అంకెల్లో కాదు, స్ఫూర్తితో కొలవాలి. ప్రభుత్వ సహకారం లేకుండా దీపా వెంకట్ ట్రస్ట్ ను ముందుకు తీసుకుపోతున్న తీరు అభినందనీయమైనది. అలాంటి కార్యక్రమాలకు ఎంతో నిబద్ధత కావాలి. ఆమెకు నా అభినందనలు అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news