ఖమ్మం నియోజకవర్గం నుంచి ఒక్క ఈక ను కూడా పికలేని పరిస్థితి నెలకొందని మంత్రి పువ్వాడ అజయ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా నన్ను మంత్రి గా చూడరు.. ఆత్మీయుడు గా కార్యకర్తలు చూస్తారు అని తెలిపారు. పువ్వాడ అజయ్ కుమార్ నా కొడుకు లాంటి వాడు అని కేసీఆర్ చెబుతున్నారు. నాలుగు ఏళ్లలో అద్భుత మైన విజయాలను ఇచ్చాము అని వెల్లడించారు.
పువ్వాడ కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కు కార్యకర్తలే కారణం అన్నారు. నిజాయితీగా ఎవ్వరి వద్ద ఒక్క రూపాయ ఆశించకుండా పని చేశాను అని తెలిపారు. అల్లా టప్ప గా తియ్యగా మాటలు చెబితే ప్రజలు నమ్మరు. మంత్రి గా పది నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత నాది అన్నారు పువ్వాడ. అతి విశ్వాసం అసలు పనికి రాదు అని.. ప్రత్యర్థి ఎవ్వరూ వచ్చిన పార్టీ మాత్రమే మనకు ముఖ్యం అన్నారు పువ్వాడ అజయ్ కుమార్. 60 ఏండ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని ఈ తొమ్మిది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు మంత్రి అజయ్ కుమార్.