ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. నియోజకవర్గంలోని ప్రజలలోను అభ్యర్థి ఎవరు అనే విషయమై చర్చనీయాంశమైనది.
వైయస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ పి రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. రవీంద్రనాథ్ రెడ్డి రెండుసార్లు కమలాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా గెలిచి రవీంద్రనాథ్ రెడ్డి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటారని ప్రజలందరూ అనుకుంటుంటే రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం తన కుమారుడు నరేన్ రామాంజనేయరెడ్డి కి టికెట్ ఇప్పించి తను వ్యాపారాలు చూసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు విశ్లేషకుల అభిప్రాయం.
జాతకాల పై నమ్మకం ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికల తేదీని బట్టి తను నిలబడతారా లేక తన కుమారుని నిలబెడతారా అనే అంశం ఆధారపడి ఉంటుంది. ఈ ఆలోచనతో ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వంలో కూడా తనకు ఓటు వేయమని నియోజకవర్గంలో ఒకరిని కూడా అడగలేదు ,ఈసారి కూడా ఫ్యాన్ కి ఓటు వేసి జగన్ ముఖ్యమంత్రిని చేయమని మాత్రమే అడిగారు.
ఈసారి ఎన్నికలలో సీనియర్ నేతలు అందరూ తాము తప్పుకొని తమ స్థానాలలో తమ వారసులను నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం వారినే తమ స్థానాలలో కొనసాగాలని సూచించినట్లు తెలుస్తోంది. అందరికీ ఆ అవకాశం ఇచ్చిన ఇవ్వకపోయినా సొంత మేనమామ కు కాదు అని చెప్పే అవకాశాలు తక్కువ. ఎటు చూసినా రవీంద్రనాథ్ కోరుకున్నది జగన్ చేస్తారు అన్నది విశ్లేషకుల అభిప్రాయం.