సీఎం అయ్యేందుకు కేటీఆర్‌ సిద్ధంగా ఉన్నారు: మంత్రి పువ్వాడ

-

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలో పట్టణ ప్రగతి వేడుకలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఖమ్మంలోని SR &BGNR కళాశాల గ్రౌండ్స్ నుంచి మన్సిపల్‌ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీలో మంత్రి అజయ్‌ పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత సీఎం.. కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారని మంత్రి పువ్వాడ అన్నారు. ముఖ్యమంత్రి ఆయ్యేందుకు కేటీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గొంగలి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన ఘనత… ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని వివరించారు. ఖమ్మం నగర అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టినట్లు వివరించారు. 80 కోట్లతో కోళ్లపాడు ప్రాజెక్టును…. ప్రభుత్వం చేపట్టనుందన్న మంత్రి .. త్వరలో తీగల వంతెనకు శంకుస్థాపన చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. ఖమ్మం నగరానికి తన సేవలు అవసరం లేదుకున్న రోజు రాజకీయాల నుంచి తప్పుకుంటానని పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news