UPSC తో సమానంగా TGPSC పని చేస్తుంది : బుర్రా వెంకటేశం

-

TGPSC కార్యాలయం లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు చేసారు. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం నా బాధ్యత. వాయిదాలు పడతాయి అనేది ఉండదు.. అలాంటి ఆలోచనలు ఉంటే తొలగించుకోండి. డీఎస్సీ పలితాలు 60 రోజుల్లో ఇవ్వగలిగాం. TGPSC రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తాము. షెడ్యూల్ ప్రకారమే అన్ని జరుగుతాయి. అంతా పారదర్శకంగా జరుగుతుంది. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే మూడున్నర ఏళ్ల సర్వీస్ ను వదులుకొని వచ్చాను.

యూపీఎస్సీ తో సమానంగా TGPSC పని చేస్తుంది. నా మీద నమ్మకం తో పరీక్షలు రాయండి. ఎవరైనా పైరవీ చేస్తా నంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండి. పబ్లిక్ కు అందుబాటులో ఒక పోన్ నంబర్ పెడతాం. TGPSC ఛైర్మన్ కు ఉన్నా విస్తృత అధికారాలను వినియోగించుకొని న్యాయం చేస్తా. తెలంగాణ గెలిచి నిలవాలి. ఐఏఎస్ కావాలని నా కల సాకారం అయింది.. రాజీనామా చేశాను. ఇప్పుడు నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చాను అని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version