రైతులకు అన్యాయం జరిగనివ్వం..!

-

సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన వైరా సభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేసాడు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన రైతులకు అన్యాయం జరిగనివ్వం అని మాట ఇచ్చారు. నాలుగేళ్లలో ఎనిమిదవ వేల కోట్ల ఖర్చు పెట్టి సీతరామ నీళ్లు పాలేరు లోకి ప్రవహింప చేస్తాం అని పేర్కొన్నారు. ఇక రైతులకు చేసిన 31 వేల కోట్ల రుణ మాఫీ ఓ చరిత్ర. 18 వేల కోట్ల రైతుల అకౌంట్లలో ఈ రుణ మాఫీ డబ్బులు పడ్డాయి.

రుణ మాఫీ కోసం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చాలా కష్ట పడ్డారు 40 లక్షల పైగా ఖాతాలకు మాఫీ ఇచ్చాం. తెలంగాణ రైతుల పండుగ ఈ రోజు జరుగుతుంది. అయితే కొన్ని పార్టీలు మమల్ని విమర్శిస్తున్నాయి. రింగ్ రోడ్ అమ్మి రుణ మాఫీ చేస్తామని చెప్పారు… కానీ ఇవ్వలేదు అని అంటున్నారు. తెలంగాణ పరిపాలన పరంగా దేశంలోని రాష్ట్రాలకు మార్గదర్శకం. దేశానికి తెలంగాణ దిక్సూచి అవుతుంది అని మంత్రి తుమ్మల తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news