రైతు భరోసా పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక కామెంట్స్ చేసారు. కేవలం పంట పండించే వారికే రైతు భరోసా ఇష్టం అని పేర్కొన్నారు. తాజాగా మహబూబ్ నగర్ లో మాట్లాడిన మంత్రి తుమ్మల ఇక నుడి కేవలం పంట పండే భూములకు రైతు భరోసా వస్తుంది. కొండలు, గుట్టలు ఉన్న భూమికి రాదు. అలాగే పంట పండించాపోయినా కూడా రైతు భరోసా రాదు అని అన్నారు.
గత BRS ప్రభుత్వం పంట పండించకపోయినా.. కొండలు, గుట్టలు ఉన్నా కూడా రైతు భరోసా ఇచ్చి 25 వేల కోట్లు వృథా చేసింది. ఇక నుండి అది జరగనివ్వం అని మంత్రి అన్నారు. అలాగే పంట భీమా ప్రీమియం మా ప్రభుత్వమే చెలిస్తుంది అని పేర్కొన్నారు. అయితే రైతు భరోసా ఎకరానికి రెండు విడతల్లో 7,500 చొప్పున మొత్తం 15 వేలు వస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే.