ఎల్లుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

-

ఈ నెల 6 వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఈ తరుణంలోనే.. జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సి.ఎస్స్.శాంతి కుమారి… కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6 వ తేదీ నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పధకం ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు.

బతుకమ్మ పండగను పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ, యువతలోక్రీడానైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా పరికరాల కిట్లను అందచేసే కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుండి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహార పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక పాఠశాల ను జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో ఎంపిక చేసి అల్పాహారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో రాష్ట్రమంత్రులు, స్థానిక శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని శాంతి కుమారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version