MLA Arikepudi Gandhi warns trs mla koushik Reddy: కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్..నేను ఇంకా BRS ఎమ్మెల్యేనే అంటూ అరికెపూడి గాంధీ ప్రకటన చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ అని… బ్రోకర్ కౌశిక్ రెడ్డి నాపై సవాల్ చేస్తాడా? అంటూ ఫైర్ అయ్యారు. నేను ఎవ్వరికి బయపడనని… నేను నిజాయితీ పడుడైన సీనియర్ ఎమ్మెల్యేను అంటూ వ్యాఖ్యానించారు.
నేను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేను.. ఆ విషయం అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ ను కలిశానని… బ్రోకర్ కౌశిక్ రెడ్డి కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ మాట్లాడితే సమా ధానం చెబుతానని పేర్కొన్నారు. నేను గాంధీ అన్న పేరు 10 రోజులు పక్కన పెట్టి కౌశిక్ రెడ్డి సంగతి చూస్తా నని సవాల్ విసిరారు అరికెపూడి గాంధీ.