ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. ఆ ఐదుగురికి మంత్రి పదవులు ఖరారు..

-

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ వేగంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది.. పీసీసీ ఛీప్ నియామకం జరిపిన వెంటనే.. క్యాబినెట్ విస్తరణకు సిద్దమైంది.. రెండో విడత నామినెటెడ్ పదవుల భర్తీకి ముందే విస్తరణ చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు..అందుకోసమే.. రేవంత్ ఢిల్లీకి వెళ్లారని తెలుస్తుంది.

క్యాబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావాహులకి మంచి రోజులు వచ్చేసాయి..
టీపీసీసీ చీఫ్ ఖరారు కావటంతో ఇప్పుడు రేవంత్ మంత్రివర్గ విస్తరణ పైన ఫోకస్ చేసారు. నామినేటెడ్ రెండో దశ పదవులకు ముందే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ఆమోదం తీసుకోనున్నారు. కొత్తగా మంత్రులయ్యే వారి విషయంపై అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీలో చర్చ నడుస్తుంది..

క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో ఆశావాహులు జాబితా ఎక్కువగా ఉండడంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేసింది.. సీఎం రేవంత్ సూచనలతో పాటు పార్టీలోనే సీనియర్ నేతలను సంప్రదించిన పార్టీ అధిష్టానం.. మంత్రివర్గ రేస్ లో ఉన్న వారి జాబితాను సిద్ధం చేసింది..

సామాజిక సమీకరణాల నేపథ్యంలో.. అన్ని సామాజిక వర్గాల వారికీ ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తుంది. ఆదిలాబాద్ నుంచి గడ్డెం బ్రదర్స్, మంచిర్యాల నుంచి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మహబూబ్ నగర్ నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి ముదిరాజ్ కోటాలలో ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, అజారుద్దీన్ పదవులను ఆశిస్తున్నా ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, ఆరు పదవులు ఖాళీ ఉన్నా.. అయిదుగురికి క్యాబినెట్లో బెర్తు ఖరారు అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.. ఎవరికి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందో.. ఎవరికి నిరాశ మిగులుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news