రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారం తగ్గించుకోవాలి..!

-

సీఎం ప్రవర్తనతో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో లాఅండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది అని MLA ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారం తగ్గించుకోవాలి. స్పీకర్ సభలో మా హక్కులను కాపాడాలి. అసెంబ్లీ పట్ల ప్రజల్లో గౌరవం తగ్గే విధంగా వ్యవహరించవద్దు. సీఎం ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడారా.. నేను సబ్జెక్ట్ మాట్లాడితే నాపై సీఎం వ్యక్తిగత ఆరోపణలు చేశారు. సభకు తాగివచ్చే వారితో నన్ను తిట్టించారు అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము,ధైర్యం వుంటే సబితకు మైక్ ఇవ్వాలి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్ని తప్పులు మాట్లాడుతున్నారు. రైతులను దొంగలుగా రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు.. వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారు. లక్షల కోట్లు రుణాలు తీసుకున్న బ్యాంకు దొంగలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నారు. అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడించకపోయినా ప్రజాక్షేత్రంలో మాట్లాడతాము. ఎప్పుడు అసెంబ్లీకి రావాలో కేసీఆర్ కు బాగా తెలుసు. మీ బాసుల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news