నేను హైదరాబాద్ లోనే ఉన్నా…మొగోడివైతే రా చూసుకుందాం – కౌశిక్‌ రెడ్డి

-

MLA Koushik Reddy Counters to Danam Nagender: నేను హైదరాబాద్ లోనే ఉన్నా…మొగోడివైతే రా చూసుకుందాం అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయి….రూల్స్ కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే స్థానం నుంచి మాట్లాడారని మండిపడ్డారు.

MLA Koushik Reddy Counters to Danam Nagender

దానం నాగేందర్ నేను హైద్రాబాద్ లోనే ఉన్న…నువ్వు మొగోడివైతే రా చూసుకుందామని సవాల్‌ విసిరారు. ఎక్కడ స్పాట్ చెప్పు నేను రావటానికి రెడీ అని… దానం నాగేందర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు అంటూ రెచ్చిపోయారు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు…కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అంటూ ఆగ్రహించారు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు అంటూ సవాళ్‌ విసిరారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news