సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు తరిమి కొట్టడం ఖాయం అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మీ తీరు సరిగ్గా లేకనే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు లేకుండా.. మెడలు పట్టి గెంటేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుతున్నాం. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు ను చూసి ఓర్వలేక కుట్రలు చేటున్నారు.
ఆఖరికి పిల్లలు చదువుకునే గురుకులాల మీద కుట్రలు చేస్తున్నారు. గురుకులాలపై ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ముఠా కుట్రలు చేస్తుంది. కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రవీణ్ కుమార్ తన మనుషులతో గురుకులాలపై కుట్రలు చేస్తున్నారు. విద్యా వ్యవస్థ ను మేము బలోపేతం చేస్తున్నాం. డైట్ ఛార్జిలు గత ప్రభుత్వం ఒక్కసారైన పెంచారా.. ఆనాడు నోరు మెదపని ప్రవీణ్ కుమార్.. ఈ రోజు ప్రజా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నారు. స్వేరో వంటి ప్రయివేట్ సైన్యంను తయారు చేశారని.. గతంలో గువ్వల బాలరాజు, బాల్క సుమన్ చేసిన కామెంట్స్ నిజమేనెమో అనిపిస్తుంది. ప్రవీణ్ కుమార్ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి అని ఎమ్మెల్యే సత్యం డిమాండ్ చేసారు.