GHMC స్టాండింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యుల అభ్యంతరాలు వ్యక్తం చేసారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయనీ కార్పొరేటర్లు విమర్శలు గుప్పించారు. వివిధ శాఖలకు కేటాయింపులు సరిగా లేవన్నారు స్టాండింగ్ కమిటీ మెంబెర్స్. సమావేశం ప్రారంభంలోనే అడ్డుకునేందుకు బీజేపీ కార్పోరేటర్లు ప్రయత్నించారు. ఇష్టానుసారం స్టాండింగ్ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడంపై బీజేపీ కార్పోరేటర్ల అభ్యంతరం తెలిపారు.
స్టాండింగ్ కమిటీలో బీజేపీ మినహా కాంగ్రెస్, MIM, బిఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. అన్ని డివిజన్లలో పన్నులు వసూలు చేసి.. కేవలం ఓల్డ్ సిటీ అభివృద్ధి కి ఖర్చు చేస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ లో 500 కోట్ల స్కామ్ జరిగింది. అయినా అధికారులు పట్టించుకోవట్లేదు అన్నారు. అయితే ప్రతి డివిజన్ లో విజిట్ చేసి సమస్యలపై చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు జిహెచ్ఎంసి కమిషనర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక జిహెచ్ఎంసి కమిషనర్, మేయర్ హామీతో నిరసన విరమించారు బీజేపీ కార్పొరేటర్లు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలు సవరించి డిసెంబర్ 9 తర్వాత మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.