సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం వద్దు : ఎమ్మెల్యే పల్లా

-

సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం పెట్టే యోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సూచించారు. ఆ ప్రదేశాన్ని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని ఓ లేఖలో ప్రభుత్వానికి గుర్తుకు చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసి, కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో కాంగ్రెస్‌ నేతలైన ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, జైపాల్‌రెడ్డి విగ్రహాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇక వీటికి అదనంగా ఇప్పుడు రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరులకు నివాళిగా నిర్మించిన అమరజ్యోతి ముందు రాజీవ్‌ గాంధీ విగ్రహం పెట్టడంపై అభ్యంతరం తెలిపారు పల్లా రాజేశ్వరరెడ్డి. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని..  ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మారుస్తామని గత ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న నమూనాలోగానీ, కొత్త నమూనాలోగానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news