సందీప్ కిషన్ కొత్త సినిమా ట్రైలర్ అవుట్.. అదిరింది అసలు..!

-

నటుడు సందీప్ కిషన్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు ఇప్పటికే పలు సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు సందీప్. సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు ఫిబ్రవరి 9న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నారు. ట్రైలర్ ని కూడా లాంచ్ చేశారు దాదాపు రెండు నిమిషాలు నిడివి తో షార్ట్ అండ్ క్రిస్పీగా ట్రైలర్ ని తీసుకువచ్చారు.

గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలు ఊరు పేరు భైరవకోన అనే డైలాగ్ తో విలేజ్ ని మిస్టీరియస్ గా ఎస్టాబ్లిష్ చేశాడు వీఐ ఆనంద్. ట్రైలర్ కి శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఊరు పేరు భైరవకోన ట్రైలర్ అద్భుతంగా కొత్తగా ఉంది మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది సినిమా కోసం కొన్ని రోజుల వరకు ఆగక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news