MLC Kavita to KCR Farm House in Erravelli: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు కల్వకుంట్ల కవిత..కాళ్లు మొక్కి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు కల్వకుంట్ల కవిత.. ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ ఆహ్వానం అందుకున్నారు కల్వకుంట్ల కవిత.
ఇక తన కన్నబిడ్డ కల్వకుంట్ల కవితను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు తండ్రి కేసీఆర్. అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం తెచ్చుకున్నారు. అటు తండ్రి పాదాలకు నమస్కరించారు కల్వకుంట్ల కవిత… బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించిన కేసీఆర్…కల్వకుంట్ల కవితతో సమావేశం అయ్యారు. ఇక అంతకు ముందు ఎమ్మెల్సీ కవితతో పాటు ఫామ్ హౌస్ కి వచ్చారు భర్త అనిల్, కొడుకు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ లోపలికి వెళ్లారు కవిత.