దిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తిహాడ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంలో సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. తిరిగి ఆగస్టు 7వ తేదీన పిటిషన్‌పై వాదనలు వింటామని ట్రయల్ కోర్టు పేర్కొంది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. న్యాయవాదులు నితీష్ రాణా, మోహిత్‌రావు రాలేదా.. అని అడిగారు. అయితే ఆ సీనియర్ లాయర్లు అందుబాటులో లేరని.. అందువల్ల డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేయాలని కోర్టును కవిత తరఫు న్యాయవాది కోరారు. ఈ క్రమంలో జడ్జి కల్పించుకుంటూ ఇప్పటికే డిఫాల్ట్ పిటిషన్‌పై రెండుసార్లు వాయిదా వేశామని.. చివరి సారిగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ విత్ డ్రా చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఆగస్టు 7 మధ్యాహ్నం 12.30కు వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news