జగిత్యాల సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు హబ్సిపూర్ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కవితాపరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై కవిత మండిపడ్డారు రాష్ట్రంలో అధికార బదిలీ జరిగిన వెంటనే జీవన్ కక్షపూరితంగా రాజేశ్వర్ రెడ్డిని సంబంధం లేని కేసులో ఇరికించారని అన్నారు. 30 ఏళ్లలో జీవన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి చేసిందని చెప్పారు. ఆ అభివృద్ధిని ఓర్వలేక అక్రమ కేసులు పెడుతున్నారని కవిత అన్నారు.
రాష్ట్రంలో నడుస్తుంది ఖాకీల లేదంటే కాంగ్రెస్ రాజ్యమా అని అడిగారు అలాంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదని కూడా కవిత చెప్పారు. ఇలా చేస్తే ప్రజలు తిరగబడతారని కూడా హెచ్చరించారు. అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇచ్చారని కవిత అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామని ఇతర పార్టీల కార్యకర్తలని రాజకీయపరంగా ఎదుర్కొన్నామె తప్ప చట్టాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులు వాడుకోలేదని కక్షపూరితంగా వ్యవహరించలేదని కవిత చెప్పారు.