ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం లో రేపు విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఆమెతోపాటు మంత్రి కేటీఆర్ కూడా వెంట వెళ్లారు. అయితే రేపటి ఈడీ విచారణకు కవిత హాజరు అవుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఈ కేసులో ఈనెల 11వ తేదీన కవితను ఈడి విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 8 గంటల పాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడి. ఆ తర్వాత 16 వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పింది. అయితే రెండోసారి విచారణకు కవిత హాజరు కాలేదు. దీంతో ఈనెల 20న హాజరుకావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది.