బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయించాలని భట్టికి కవిత లేఖ

-

బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్ లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు లేఖ ఎమ్మెల్సీ లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు.

బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఈ లేఖలో గుర్తు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల వ్యయంతో ఆచార్య జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో 20 వేల కోట్లు కేటాయించాలని భట్టి విక్రమార్కను కవిత కోరారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అన్న ఎమ్మెల్సీ కవిత… బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version