గిరిజన రైతుల ఆగ్రహ జ్వాలలు చూశాకైనాముఖ్య మంత్రి సొంత జిల్లా వికారాబాద్ లగచర్ల గ్రామంలో పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీ ల ఏర్పాటు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ డిమాండ్ చేసారు. గిరిజన రైతులు అధికారులపై చేసిన దాడి ఘటన దురదృష్టకరమని, సీఎం అసమర్థ పాలనలో అదికారులు ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం ప్రజా వ్యతి రేక నిర్ణయాలతో పాలన గాడి తప్పి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేసారు ఆమె.
ఇక ఫార్మా సిటీ కోసం మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సమీపంలో 15 వేల ఎకరాల భూమి సేకరించి సిద్ధం చేసి పర్యావరణ అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చిన ఆ భూములను పక్కనపెట్టి గిరిజనుల జీవనాధారమైన పచ్చటి పంట పొలాల్లో ఫార్మా చిచ్చు పెట్టీ భూములను బలవంతంగా లాక్కునే దుశ్చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నా ఎమ్మెల్సీ.. సీఎం రేవంత్ రెడ్డి 11 నెలల పాలనలో ఢిల్లీ లోని అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి 25 సార్లు వెళ్ళాడని , ఢిల్లీకి కప్పాలు కట్టే శ్రద్ధ పరిపాలన మీధ లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.