లగచర్ల లో కలెక్టర్, అధికారులపై దాడి చేయడం బాధాకరం. బండల తో కర్రలతో దాడిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లా జరగలేదు అని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. కులగణన చేసే సమయంలో కూడా మాటలతో దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఐఏఎస్ సంఘాలు కూడా ఖండించలేదు. ఉద్యోగ సంఘాలు నేతలుగా ఖండిస్తున్నాం. దాడిచేసిన వారిపై పీడీ యాక్ట్ పెట్టాలి అని డిమాండ్ చేసారు. మా స్వేచ్ఛను హరిస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు.
ఇక ఈ దాడి తర్వాత తెలంగాణాలో ఉద్యోగులు భయంతో పని చేస్తున్నారు. ఇప్పటివరకు భూసేకరణ జరగకుండా అభివృద్ధి జరిగిందా.. మొన్నటి దాడి చూస్తే సిగ్గుగా వుంది. ఒంటరి మహిళా వెళ్లి ఉద్యోగం చేస్తదా.. రాజకీయనాయకులు జనాలను రెచ్చగొట్టకంటి చైతన్య పరచండి. ఇక ఈ దాడి పై రేపు లంచ్ అవర్లో నిరసన ఉంటది అని పేర్కొన్నా జేఏసీ చైర్మన్.. రాజకీయాలు చేసుకోండి కానీ ఉద్యోగులను ఇబ్బందికి గురిచేయకండి అని అన్నారు.