మాజీ మంత్రి హరీష్ రావుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్..!

-

మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నాము. సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయి. మీ పాపపు పరిపాలన పై మా సీఎం ప్రక్షాళన చేస్తున్నాడు. రాజన్న ఆలయంను అభివృద్ది చేస్తన్నాని మోసం చేసింది మీరు. 7 లక్షల కోట్లు అప్పు చేసిన మీరా మాట్లాడేది అని ప్రశ్నించారు.

20 ఏళ్ల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది మేము. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. 10 ఏళ్ళ పరిపాలన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. దేశం లొనే చరిత్ర, ఏక కలలంలో రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్. ప్రగతి భవన్ ను మీరు ప్రగాళభాల కోసం… మేము ప్రజల సమస్యల కోసం వేదిక గా మార్చాము. మీరు ప్రమాణం చేసి రాజన్న గుడిని డెవలప్ చేయలేదు. మేము రాజన్న ఆలయానికి మేము 50 కోట్లు మంజూరు చేసాం. పదేళ్ల లో రాష్ట్రము లో విద్వాంసం చేసారు.. రాజన్నకి ఇచ్చిన మాట తప్పారని మిమ్మల్ని గద్దె దింపారు అని శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version