కేసీఆర్ ను పరామర్శించిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్ రూమ్ లో కాలు జారి కింద పడిన విషయం తెలిసిందే. అయితే తుంటి ఎముక విరిగిపోవడంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో సర్జరీ చేసిన విషయం తెలిసిందే. నిన్న సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రి వద్దకు వెళ్లి పరామర్శించారు.

తాజాగా  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి., చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కూడా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news