కేసీఆర్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి.. పొన్నాల సెటైర్..!

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవలే బాత్రూంలో కాలు జారి కింద పడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. డాక్టర్ సంజయ్ కేసీఆర్ కి హిప్  సర్జరీ చేసిన విషయం తెలిసిందే. అయితే  నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రి వద్దకు వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

- Advertisement -

కేసీఆర్ కి అందుతున్న చికిత్స గురించి రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవపై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఇది శుభపరిణామమని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి పరామర్శ ఫొటోలను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని సెటైరికల్ క్యాప్షన్ ఇచ్చారు. నన్ను కనీసం ఏది పాటు అయినా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్ గాను.. అంటూ వేడుకుంటున్నాడని క్యాప్షన్ ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్య పేరుతో ఈ వాట్సాప్ స్టేటస్ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పలువురు నెటిజన్స్ పొన్నాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరూ మాత్రం ఇందులో వాస్తవం ఎంత అని ఆరా తీస్తున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లో చేరారు పొన్నాల లక్ష్మయ్య.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...