రోడ్లు వేయడానికి కూడా నిధులు లేవా? : కేటీఆర్

-

గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు వేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వద్ద నిధులు లేవా? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రోడ్లు వేయకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా సాధ్యపడుతుందొ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. మాజీ సర్పంచుల సంగతి సరే.. చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పుల పాలు అవుతున్నారని గుర్తుచేశారు.

దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొస్తే దానిని రేవంత్ సర్కార్ అటకెక్కించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే.. ఆసరా పెన్షన్ దాతలు సహాయం చేస్తే గానీ రోడ్లు వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో కొంచెం కూడా సిగ్గుఅనిపించడం లేదా సీఎం రేవంత్ రోడ్డి అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news