తెలంగాణ ప్రభుత్వానికి ఎంపీ అసదుద్దీన్ కృతజ్ఞతలు

-

తెలంగాణ ప్రభుత్వానికి ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ లో రాత్రి ఒంటిగంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చాలా మంది వ్యాపారులకు భారీ ఉపశమనం కలిగిస్తోందన్నారు. మజ్లిస్ పెట్టిన రిక్వెస్ట్ కు సీఎం రేవంత్.. స్వయంగా అసెంబ్లీ వేదికగా స్పందించి.. సమస్యను తక్షణమే పరిస్కరించడం శుభపరిణామం అన్నారు. 

అర్థరాత్రి ఒంటిగంట వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండవచ్చని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. పోలీసులు గత కొద్ది నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసి వేయిస్తున్నారు. రాత్రి 11 దాటిన తరువాత ఆహారం కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలా మంది నుంచి ఫిర్యాదులు రావడంతో మద్యం దుకాణాలు మినహా ఇతర ఏ వ్యాపారమైనా రాత్రి ఒకటి వరకు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసారు. మద్యం దుకాణాల విషయంలో మినహాయింపులు ఉండబోవని సీఎం సభలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news