‘నేను ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాలో బాత్రూమ్ లు కడుగుతుండే’ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు 

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాలో బాత్రూమ్ లు కడుగుతుండే అని ఎద్దేవా చేశారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కచ్చితంగా బీసీలకు ఇవ్వాలని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండన్నారు. సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఎక్కువ మంది ఓసీలే ఉన్నారని.. కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ మాత్రమే అన్నారు. పంట నష్టం రూ.10వేలు ఏవని ప్రశ్నించారు. 

ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవీ అవసరం లేదని.. బతుకు తెలంగాణ కావాలన్నారు. తెలంగాణలో సర్వేలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల వారు కాంగ్రెస్ కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి ఒక ఇల్లు కట్టలేదు కానీ.. ఎన్నికల ముందు గృహలక్ష్మీ అని..నియోజకవర్గానికి 3వేల ఇండ్లు అని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దళితబంధు లో కమిషన్ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి పదవీలు ఏవి వద్దు.. బంగారు తెలంగాణ కాదు.. మన పిల్లలకు బతుకునిచ్చే తెలంగాణ కావాలని కోరుతున్నట్టు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news