ఏపీలో నిరుద్యోగులకు అలర్ట్‌.. APPSC నుంచి నోటిఫికేషన్‌

-

ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఎపీపీఎస్సీ) శుభవార్త చెప్పంది. ఏపీ కాలుష్యనియంత్రణ మండలిలో 29 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీ పీసీబీలో సహాయ పర్యావరణ ఇంజనీర్లు పోస్టులు 21, గ్రేడ్ 2 అనలిస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆర్ధికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి.

ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి మళ్లీ ప్రిలిమ్స్‌- తొలిగింపు యోచన విరమణ  దిశగా..!! | The APPSC has reconsidered its earlier decision, commission is  thinking of continuing the Prelims - Telugu ...

ఇదిలా ఉంటే.. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకనలో తెల్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం కమిషన్‌ వెబ్‌సైట్‌ను నిలిపివేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు వెబ్‌సైట్‌ సేవలు ఉండవని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ నియామక రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ముందే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఆగస్టు 18, 19, 20 తేదీల్లో డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉండదని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్ధులు గ్రహించాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news