BRS పార్టీలో చేరిన ములుగు BJP నేత కృష్ణ

-

ములుగు బిజెపి నేత కృష్ణ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో ములుగు బిజెపి నేత కృష్ణ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ వచ్చాక ములుగు జిల్లా బాగా అభివృద్ధి జరిగింది… ములుగు లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ములుగు ను జిల్లా చేశారన్నారు. సమ్మక్క,సారక్క జాతరను సీఎం కేసిఆర్ పెద్ద యెత్తున నిర్వహిస్తున్నారు… ఐటీసీ ఫ్యాక్టరీ ప్రారంభానికి రెఢీ గా ఉందని గుర్తు చేశారు.

Mulugu BJP leader Krishna joined BRS party

ములుగు అభ్యర్థిగా నాగజ్యోతిని గెలిపించండని కోరారు. ఎవరెన్ని చెప్పినా నమ్మకండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు.సీతక్క సోషల్ మీడియా లో మాత్రమే ఉంటారు… పని తక్కువ ప్రచారం ఎక్కువ సీతక్కకు అంటూ చురకలు అంటించారు. నిరుపేద అమ్మాయి నాగజ్యోతి ఆమె ను గెలిపించాలని కోరుతున్నా..సీతక్క ఓడిపోతున్ననని తెలిసి కోపంతో ఇష్టం వచ్చినట్లు నోరు జారుతుంది.ఆమె ఓటమి ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news