కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు.. విచారణ అక్టోబర్ 30కి వాయిదా!

-

మంత్రి కొండా సురేఖ మీద అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ అక్కినేని కుటుంబం పైన, సమంత పైన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే కొండా సురేఖ తాను కేటీఆర్ ని విమర్శించే క్రమంలో భావోద్వేగానికి గురై వ్యాఖ్యలు చేశానని, తనని క్షమించమని చెప్పినప్పటికీ సురేఖను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

ఇక ఏకంగా నాగార్జున కొండా సురేఖ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేసి ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది.

కొండా సురేఖ తరపున అడ్వకేట్ గుర్మీట్ సింగ్ రిప్లై ఫైల్ చేశారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది కోర్ట్. ఇక మరోవైపు సురేఖ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పరువు నష్టం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై నేడు నాంపల్లి న్యాయస్థానం ముందు ఆయన హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version