జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ను యూజీసీ ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 11 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను జనవరి 01 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నామని యూజీసీ ఇది వరకే ప్రకటించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ ను నవంబర్ 07 విడుదల రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.
టెట్ పరీక్షలను కూడా జనవరి 01 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. అయితే ఈ రెండు పరీక్షల షెడ్యూల్ ఒకే సమయంలో ఉండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్ పరీక్ష జాతీయ స్థాయిలో జరుగుతుంది కాబట్టి దానిని పోస్ట్ ఫోన్ వేయడం కుదరదని.. టెట్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని వారు కోరుతున్నారు. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరీ.