తొమ్మిదోతరగతి విద్యార్థి కొత్త ఆవిష్కరణ.. కలెక్టర్ ఫిదా..!

-

మన దేశంలోనిత్యం గంటకు 19మంది ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు యూటర్న్ తీసుకునే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా జరుగుతుంటే.. ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లు హెల్మెట్ పెట్టుకోకపోవడం కారణంగానే ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని సర్వే లు పేర్కొంటున్నాయి.

ఈ ప్రమాదాలను అరికట్టాలి అనుకొని.. తన మెదడుకు పదును పెట్టారు. చివరికి ద్విచక్రవాహనాలను స్టార్ట్ చెయాలన్నా.. సరే కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకుంటే చాలు బైక్ స్టార్ట్ అయిపోతుంది. హెల్మెట్ ధరించకపోతే తలకిందులుగా తపస్సు చేసిన స్టార్ట్ కాదు. ఇంత గొప్ప ఆవిష్కరణ చేసి మనసుంటే మార్గం ఉంటుంది అని నిరూపించింది కేవలం 9వ తరగతి విద్యార్థి. మంచిర్యాల జిల్లా నస్పూర్ కు చెందిన సాయి అనే బాలుడు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నారు. సెన్సార్ ని ఉపయోగించి హెల్మెట్ పెట్టుకుంటేనే బండి స్టార్ట్ అయ్యేవిదంగా హెల్మెట్ తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ సాయిని, అతని తల్లిదండ్రులను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించారు. అతనికి ప్రోత్సహించిన తల్లిదండ్రులను మెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news