తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త

-

తెలంగాణ‌రైతుల‌కు కేసీఆర్ స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. వానాకాలం సాగు ప్రణాళికపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు జ‌రిగింద‌ని.. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి జ‌రిగింద‌న్నారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారు .. ఈ ఏడాది రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 1332 పత్తి ఎక్కువ సాగు చేసే క్లస్టర్లు, వెయ్యికి పైగా వరి సాగు చేసే క్లస్టర్లు, 82 కంది సాగు చేసే క్లస్టర్లను గుర్తించామని చెప్పారు.

క్లస్టర్ల వారీగా పంట ప్రణాళికలు సిద్దం చేశామ‌ని.. ఆయా పంటలకు కావాల్సిన విత్తనాలను సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశామ‌నిచెప్పారు. పచ్చి రొట్ట ఎరువులను ప్రోత్సహించి భూసారం పెంచే దిశగా రైతులను సన్నద్దం చేయాలని.. మే నెలలో వీటిని రైతులకు పంపిణీ చేయాలనిపేర్కొన్నారు. కల్తీలేని నాణ్యమైన విత్తనాల సరఫరాకు అధికారులు చర్యలు తీసుకోవాలి… కల్తీని నిరోధించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేయాలి…పంటల ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దంగా ఉంచాలి .. మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉండేలా చర్యలు ఉంటాయ‌నిహెచ్చ‌రించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అన్ని ఎరువులు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news