తెలంగాణ రైతుల కోసం మరో కొత్త పథకం – మంత్రి నిరంజన్‌

-

తెలంగాణ రాష్ట్ర రైతాంగంకు పంట నష్ట పథకం రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని… త్వరలో ఆ పథకాన్ని తీసుకువస్తామని ప్రకటించారు మంత్రి నిరంజన్ రెడ్డి. శాసన మండలిలో ఆయన ఇవాళ మాట్లాడుతూ…కేంద్రం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవడం లేదని… పంటల బీమా విషయంలో కాలం చెల్లిన విధానాన్ని కేంద్రం అవలంభిస్తుందని ఆగ్రహించారు.

రైతాంగ హృదయం, రైతాంగ మనస్సు కేంద్రానికి లేదని విమర్శలు చేశారు.కేంద్ర ప్రభుత్వం రైతుల పంట బీమాకు సరైన విధానం తీసుకురావాలన్నారు. దేశ ప్రజలను ఫసల్ భీమా యోజన పథకం పేరుతో మోసం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.వ్యవసాయేతర రంగాలకు భీమా పథకం ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా యోజన పథకాన్ని పక్కన పెట్టాయని..గడిచిన నాలుగేళ్ళలో 2415 కోట్లు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే 1893కోట్లు మాత్రమే రైతులకు క్లైమ్ అయ్యింది. 522 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలు లాభం పొందాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించగా… సుమారు 300 కోట్లు నష్ట పరిహారం చెల్లించామని వివరించారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news