తడిగుడ్డతో రేవంత్ ప్రభుత్వం రైతుల గొంతులు కొస్తుంది : నిరంజన్ రెడ్డి

-

పాలమూరు వలసలను ఆపి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరును దానిని పచ్చగా చేసింది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి చదువుకున్నప్పుడు వలసల దుస్థితిని ఎదుర్కొన్నది కాంగ్రెస్ పాలనలోనే కదా .. రేవంత్ తండ్రి మరణిస్తే స్నానాలు చేయడానికి నీళ్లు లేవని చెప్పింది రేవంత్ రెడ్డే కదా. కానీ ఈ ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఏపీ ప్రభుత్వం క్రిష్ణా నది నుండి శ్రీశైలం ద్వారా తెలుగుగంగ, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ద్వారా దాదాపు 400 టీఎంసీల నీటిని తీసుకువెళ్లింది. కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి ముందు చూపులేదు.

ఉద్దేశపూర్వకంగా కల్లాలలో ధాన్యం కొనుగోలు చేయకుండా పథకం ప్రకారం దళారులను ఆశ్రయించేలా చేస్తున్నారు. ఈ ఏడాదిలో కరంటు అస్థవ్యస్తంగా వచ్చిన కారణంగా, మరి ఇతర కారణాలతో రాష్ట్రంలో 568 మంది మరణాలు నమోదయ్యాయి. కేసీఆర్ ఇచ్చిన ఎకరాకు రూ.10 వేల రైతుబంధు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం రూ.35 వేల కోట్ల బోనస్ ఎక్కడ ఇస్తుంది.. రైతుబంధు ఎగ్గొట్టేందుకు వ్యవసాయ శాఖా మంత్రి ద్వారా మెల్లగా లీకులు ఇస్తున్నది . తడిగుడ్డతో మెల్లగా ప్రభుత్వం రైతుల గొంతులు కొస్తుంది. అధికారం కోసం కేసీఆర్ ఒకటి ఇస్తాం అంటే మేము రెండు ఇస్తాం అని చెప్పి మోసం చేశారు అంటూ నిరంజన్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news