బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ

-

హైదరాబాద్లో బుధవారం రోజున ముంబయి ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ క్రికెట్ జట్టు యజమాని నీతా అంబానీ ఈ మ్యాచ్ చూసేందుకు నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాలు సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు.

ఆలయ ఈవో కుంట నాగరాజు, ఛైర్మన్‌ కొత్తపల్లి సాయిబాబాగౌడ్‌ నీతా అంబానీకి స్వాగతం పలికారు. అక్కడి అద్దాల మండపాన్ని నీతా అంబానీ దర్శించుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఐపీఎల్‌ సందర్భంగా నగరంలో ముంబయి ఇండియన్‌ క్రికెట్‌ జట్టు ఎప్పుడు ఆడినా ఆ టీం యజమానిగా నీతా అంబానీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఇక ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డ్ స్థాయిలో అదరగొట్టింది. ముంబయి జట్టును ఓడించింది. బ్యాటర్లు మెషీన్‌ గన్నుల్లా పేలి ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. హార్దిక్ సేనను 31 పరుగుల తేడాతో ఓడించారు.

Read more RELATED
Recommended to you

Latest news