నిజామాబాద్ రైతులకు పోరాటం చేసే సత్తా ఉంది – రేవంత్ రెడ్డి

-

నిజామాబాద్ రైతులకు పోరాటం చేసే సత్తా ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హాత్ సె హాత్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీంగల్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత రైతులను అదుకోలేదన్నారు. బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒక కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ యువతకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు.

కల్వకుంట్ల కుటుంబానికి వేలకోట్ల ఆస్తుల వచ్చాయి, ఫామ్ హౌస్ భూములు వచ్చాయని ఆరోపించారు. ఆదాని, అంబానీ లకు దేశ సొత్తును మోడీ దోచి పెడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చిన ప్రజల కష్టాలు తీరలేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయిండని అన్నారు. 100 రోజుల్లో చెరుకు పరిశ్రమ తెరుస్తానని చెప్పి మాట తప్పారని.. ఈ ప్రాంత రైతులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చూసి పార్టీ నష్టపోయిన తెలంగాణ ను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news